benefits of Fruits

Pomegranate(దానిమ్మ)

Pomegranate(దానిమ్మ)

One of the extraordinary fruits given by the nature is pomegranate. Often red in color with very sweet and juicy seeds inside, these fruits are rich in several nutrients and antioxidants. Hence it is very frequently recommended by doctors for maintaining a healthy heart. Moreover in Indian tradition, after coconut and banana these are the fruits which are commonly dedicated to god. But, you may find it a bit confusing to know such a worshipping fruit has also got some cons. so lets find out what are the benefits and drawbacks we are going to get with it !

Benefits
  • Pomegranates have good nutritional value. It has enormous presence of vitamin C, A and E including with potassium and fiber. As a result it is very handy in fighting with infections as well as keeping the entire body in active mode.
  • Vitamin C is considered to be the most important nutrition for our health and these fruits contain nearly 50% of our daily consumption of vitamin C.
  • Most of the people spit the white seeds after eating the red flesh on the seeds but that is the essential part to get fiber content. So it is recommended by the physicians to consume entire seeds to get at most use of it.
  • Although there are no proofs of experiments about its affect on sugar patients, pomegranates are commonly used for curing diabetes from traditions.
  • According to health researchers, drinking of pomegranate juice is very much useful in increasing memory power.
  • It ensures a healthy heart by maintaining low cholesterol values and keeping the blood flow intact. This is the reason why it is often recommended for heart patients.
  • Due to high presence of antioxidants pomegranate can reduce inflammation in the stomach and improves the digestion process. It is also recommended for avoiding constipation.
  • According to health specialists it is three times more beneficial than red wine and green tea.
Drawbacks
  • The substances present in the pomegranate may affect the functioning of enzymes present in liver. So it is advised to avoid this fruit when you are suffering with any liver disorders.
  • when taken beyond the limit, some people may face gastric trouble, diarrhea and even vomiting. But should not be worry as these are temporary.
  • If consumed in excess it may leads to allergies, difficulty in breathing, pain in mouth for some people.
  • It is recommended for diet maintaining people to take it in a limited quantity as it has the potential to increase the calories.

ప్రకృతి అందించిన అతి గొప్ప పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లలోని గింజలు అత్యంత తీయగా ఎన్నో పోషణలు, అనామ్లజనకాలు కలిగి ఉంటాయి. అందుకే వీటిని వైద్యులు అధికంగా హృద్రోగులకు సిఫారసు చేస్తుంటారు. ఇక భారతదేశంలోనైతే కొబ్బరి, అరటి తరువాత అత్యంత భక్తి శ్రద్దలతో దేవుడికి అర్పించే పండు కూడా ఇదే. అయితే అటువంటి పవిత్రమైన పండుతో నష్టాలు కూడా ఉండడం కొంత ఆశ్చర్యం కలిగించే అంశమే. మరి అటువంటి పండులోని లాభాలు, నష్టాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

లాభాలు
  • దానిమ్మ పండులో పోషణలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఏ మరియు విటమిన్ కె మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు పొటాషియం మరియు పీచు పదార్ధాలు కూడా అత్యున్నత స్థాయిలో లభిస్తాయి. తద్వారా ఈ పండు వలన రకరకాల అంటు రోగాలను దరిచేరకుండా చూసుకోవడమే కాకుండా ఉత్తేజభరితమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.
  • మన ఆరోగ్యానికి విటమిన్ సి అనేది ఎంతో ముఖ్యం కాగా రోజూ కావలసిన దానిలో యాభై శాతం ఈ పండు ద్వారా లభిస్తుంది.
  • ఎక్కువ శాతం మంది దానిమ్మ గింజల గుజ్జుని తిని తెల్లని గింజలను ఊయడం సహజంగా జరిగేదే, అయితే మనకు కావలసిన పీచు పదార్ధం ఎక్కువగా వీటిలోనే ఉంటుందని తెలుసుకోవాలి. కాబట్టి ఈ పండుతో ఎక్కువగా లాభాలు పొందాలంటే మొత్తం గింజలను తినడం తప్పనిసరి.
  • ఎటువంటి పరిశోధనాత్మక సాక్ష్యాలు లేకపోయినా ప్రాచీన కాలం నుండి ఈ పండును మధుమేహ నివారణకు వినియోగించడం పరిపాటిగా వస్తోంది.
  • అంతేకాకుండా దీని రసాన్ని రోజూ తీసుకోవడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.
  • తక్కువ స్థాయిలో కొవ్వు మాత్రాన్ని ఉంచుతూ, సరైన రక్తప్రసరణకు కారణమవుతుంది కనుకనే వైద్యులు అధికంగా ఈ పండుని హృదయ సంబంధిత రోగులకు ఎక్కువగా సిఫారసు చేస్తుంటారు.
  • వీటిలో ఎక్కువ మోతాదులో అనామ్లజనకాలు ఉంటాయి కనుక కడుపులో మంటను తగ్గించి అరుగుదలను పెంచుతుంది. అంతేకాకుండా మలబద్దకాన్ని కూడా ఈ పండుతో దూరం చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఇక ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ఖరీదైన రెడ్ వైన్ మరియు గ్రీన్ టీల కంటే ఈ పండుతో మూడు రెట్ల లాభం లభిస్తుందని పరిశోధకులు అంటున్నారు.
నష్టాలు
  • దానిమ్మలో ఉండే కొన్ని పదార్ధాలు కాలేయంలో ఉండే జీవ రసాయనిక పదార్ధాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అందుకే కాలేయ వ్యాధులతో బాధపడే వారు దీనికి కొంతకాలం వరకు దూరంగా ఉంటే మంచిదట.
  • దీనిని అమితంగా తిన్నా గ్యాస్ ట్రబుల్, డయేరియా మరియు వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇవేవీ అంత ప్రమాదకరమైనవి కావనే చెప్పాలి.
  • ఇక కొంతమందిలో అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన అలర్జీకి దారితీయడంతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు, నోటికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు.
  • మరోవైపు బరువుతగ్గేందుకు పాటుపడే వారు దీనికి కొంత దూరం ఉంటేనే మంచిదని కొంతమంది ఆరోగ్య శిక్షకులు అంటున్నారు. ఎందుకంటే వీటిలో కొవ్వును పెంచే గుణాలు కూడా ఉంటాయనేది వారి వాదన.
Read More

benefits of vegetables

Mushrooms(పుట్టగొడుగులు)

Mushrooms(పుట్టగొడుగులు)

Mushrooms are not plant resultants, hence they cannot be termed as vegetables. But if we make a list of useful vegetables around the world, mushrooms occupy top place. They are the abundant source of proteins as well as nutrients and are considered to be most useful than any other fruit or vegetable. There are more than 10000 mushroom species in the world and each one has its own uniqueness. But all the mushrooms are not safe enough as they give rise to serious problems. Lets see what are the unusual benefits and most occurring side effects of it.

Benefits
  • Mushrooms are very much useful in improving immune system. The mineral selenium which is not present in most of the fruits and vegetables makes sure of effective liver function. Also this selenium is very much useful in destroying some cancer causing cells.
  • It is high in fibers, as a result it is very much useful for controlling diabetics. Including fibers, they also contain high amounts of potassium, vitamin c and low amounts of sodium, which are pretty much useful for heart and blood pressure problems.
  • Button mushrooms can improve hair growth, avoid skin related issues and even treat polio. They can also eradicate all type of viruses and bacteria.
  • Vitamin D is responsible for regulating the cell growth in our body and mushrooms are great source of it.
  • Mushrooms have high amounts of antioxidants that can kill cancer causing chemicals in our body. It improves the immune system of women suffering with breast cancer.
  • One more advantage of mushrooms is its gluten free quality. Gluten free food items can avoid any digestive related issues like celiac disease.
  • Mushrooms also contain low cholesterol maintaining properties, that are very much useful for weight management.
Drawbacks
  • The main disadvantage with mushrooms is food poisoning. Make sure you buy the quality mushrooms instead of contaminated ones. Mostly improper storage and unclean cooking leads to this problem.
  • The result of food poison will be severe and can be identified within minutes. In this case, people may suffer with diarrhea, vomiting, headache and even hallucinations.
  • There are wild mushrooms which can deceive as button mushrooms. Consuming of them leads to very harmful effects and even causes death.
  • In some people who are sensitive to immune system, consuming mushrooms can cause allergic reactions. And for some people it may cause headache also.
Conclusion

It is difficult to differentiate which mushrooms are safe to eat and which are not. so people should have awareness about its quality before cooking. It is estimated that over thousand species of mushrooms, hundreds of species are found harmful. If you are able to skip this problem, mushrooms are not less than elixir for your life.


పుట్టగొడుగులు మొక్క జాతికి చెందినవి కావు కాబట్టి వాటిని కూరగాయగా పరిగణించలేము. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే లాభదాయక కూరగాయల జాబితాను రూపొందిస్తే అందులో పుట్టగొడుగులు ముందు వరుసలో ఉంటాయనే చెప్పాలి. వీటిలో ప్రోటీన్లు, న్యూట్రిన్లు అధికంగా ఉంటాయి కనుక ఇతర పండ్లు, కూరగాయల కంటే వీటి వినియోగమే ఎక్కువగా ఉంటుంది. పుట్టగొడుగులలో కొన్ని వేల రకాలు అందుబాటులో ఉన్నాయి, వాటిలో దేని ప్రత్యేకత దానిదే. కాని అన్ని పుట్టగొడుగు జాతులు శ్రేయస్ఖరమని చెప్పలేము, ఇందులో కొన్ని రకాలు చాలా ప్రమాదకరంగా కూడా మారతాయి. మరి వీటి వలన కలిగే అసాధారణ లాభాలు, ఎక్కువగా సంభవించే నష్టాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

లాభాలు
  • పుట్టగొడుగులతో లాభాల గురించి ప్రస్తావిస్తే ముఖ్యంగా చెప్పుకోవలసింది రోగ నిరోధక శక్తిని పెంచే గుణం గురించి. ఇందులో ఎక్కువగా సెలీనియం అనే ఖనిజ పదార్ధం మరే ఇతర పండ్లు, కూరగాయలలో లభించదు. కాలేయం సరిగా పనిచేయడానికి ఈ ఖనిజ పదార్ధం ఎంతో దోహద పడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ కారక కణాలను రూపు మాపడంలోనూ ఈ ఖనిజం బాగా ఉపయోగపడుతుంది.
  • పుట్టగొడుగులలో పీచు పదార్ధం ఎక్కువగా ఉండడం వలన మధుమేహ వ్యాధి దరిచేరకుండా ఉంటుంది. ఈ పీచు పదార్ధంతో పాటు అధిక మోతాదులో పొటాషియం, విటమిన్ సి మరియు తక్కువ మోతాదులో సోడియం ఉండడం వలన హృద్రోగ సమస్యలకు, రక్త ప్రసరణ సమస్యలకు పుట్టగొడుగులు అద్భుతంగా పనిచేస్తాయి.
  • పుట్టగొడుగులు ముఖ్యంగా గుల్ల పుట్టగొడుగులలో జుట్టును సంరక్షించే గుణాలు, చర్మ రోగాలను నివారించే గుణాలతో పాటు పోలియోను కూడా అరికట్టే గుణాలు ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఇవి అన్ని రకాల బ్యాక్టీరియా మరియు ఫ్లూ వ్యాధులను కూడా నివారించగలవు.
  • ఇక మన శరీరంలో కణాల వృద్ధికి తోడ్పడే విటమిన్ డి పుట్టగొడుగులలో అధికంగా ఉంటుంది.
  • క్యాన్సర్ కణాల వృద్ధికి తోడ్పడే రసాయనాలను హరించేందుకు దోహదపడే అనామ్లజనకాలు ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఛాతీ క్యాన్సరును ఎదుర్కొంటున్న మహిళల్లో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
  • పుట్టగొడుగులలోని ముఖ్యమైన లాభాలలో గ్లూటెన్ లేకపోవడం కూడా ఒకటి. గ్లూటెన్ లేని ఆహార పదార్ధాలు అరుగుదలలో మంచి ఉపయోగకారిగా ఉంటాయి. అంతేకాకుండా అరుగుదలను క్షీణింపజేసే సిలియాక్ వంటి రోగాలను దరిచేరనివ్వవు.
  • ఇక చివరిగా, పుట్టగొడుగులలో కొవ్వును తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గేందుకు ఇది ఎంతో దోహద పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
నష్టాలు
  • పుట్టగొడుగుల వలన కలిగే ముఖ్యమైన సమస్య, విషపూరితమయ్యే ఆహారం. కాబట్టి కొనే ముందు వాటి నాణ్యతను, అమ్మే సంస్థను పరిగణలోనికి తీసుకోవాలి. కలుషిత పుట్టగొడుగులను కొనుగోలు చేయడం, సరిగా నిలువ చేయకపోవడం లేదా అపరిశుభ్రంగా వండడం ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.
  • పుట్టగొడుగుల విషాహారం తినడం మూలంగా నిమిషాలలోనే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అధిక తలపోటు, డయేరియా, వాంతులవడం మరియు మానసిక భ్రాంతులు కలగడం తరచూ సంభవించే రోగాలు.
  • బయిట లభించే నాటు పుట్టగొడుగులు తింటే చాలా ప్రమాదకరమైన పరిణామాలు ఎదురవుతాయి, వీటి వలన ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు.
  • రోగనిరోధక శక్తి లోపించే కొంతమందిలో పుట్టగొడుగుల ఆహారం అలర్జీకి దారితీస్తుంది. మరికొంతమందిలో భరించలేని తలనొప్పిని కలిగిస్తుందని అనుభవజ్ఞులు అంటున్నారు.
చివరగా

పుట్టగొడుగులలో ఉపయోగకరమైనవి, హానికరమైనవి గుర్తించడం కొంచం కష్టం కనుక వాటిని కొనే ముందు నాణ్యతను సరి చూసుకోవాలి. అంతేకాకుండా వాటిని సరైన విధంగా నిలువచేసుకుని శుభ్రమైన రీతిలో వండుకోవడం తప్పనిసరి. వీటిలో కొన్ని వేల రకాలు అందుబాటులో ఉండగా కొన్ని వందల సంఖ్యలో ప్రమాదానికి గురిచేసే పుట్టగొడుగులు ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అందుకే పుట్టగొడుగుల్లో ఉండే ఈ ప్రతికూలతను కనుక అధిగమించినట్లయితే అమృతం లాంటి ఆహారం మీకు దొరికినట్లే.

Read More

benefits of Spices

Curry Leaves కరివేపాకు

Curry Leaves కరివేపాకు

Curry Leaves are the natural fragrant and flavoring agents widely used in every Indian cuisine. Most of the Indian people have an opinion that the taste of any recipe is incomplete without adding of these leaves. It is an old herbal plant rich in Antioxidants, Vitamins, Calcium that can protect us from many health issues. Originated from India and later spread to Sri Lanka, these beneficial leaves are also considered as harmful to the body. It may look strange but it is true, says some health experts. So lets find out what are the common advantages and unknown drawbacks of these leaves.

Advantages
  • Cures Anemia : If you consume curry leaves for a month it can cure Anemia disease. It is caused due to lack of iron and curry leaves are very rich in iron and folic acids.
  • Liver Protector : Curry Leaves are very rich in antioxidants that are very much essential for a healthy liver. Also these leaves work as a laxative in cleaning the stomach thereby ensuring its effective function.
  • Fat reducing agent : So many studies have proved that curry leaves can reduce the fatty contents in the body. People who are looking to reduce the body weight can consume it daily without any doubt.
  • Avoids Hepatitis : Curry leaves have more number of antioxidants, Vitamin A and Vitamin C which plays vital role in avoiding Hepatitis.
  • Eye protector : Lack of Vitamin A can lead to loss of vision or night blindness, as curry leaves are one of the main source of Vitamin A these problems can be simply eradicated.
  • Anti diabetic agent : Health experts have proved that curry leaves have the potential to control the diabetes. They recommend to consume these leaves every day with their regular diet.
  • Ayurvedic Medicine : The paste of curry leaves can be used as a very good remedy to cure skin infections, for healing the wounds, for providing relief to the burns etc. These leaves are also well used in solving the hair related issues.
Drawbacks
  • There are very less drawbacks with curry leaves compared to other regular herbs. According to some researchers the raw usage of curry leaves may result in diarrhea and vomiting. This happens when the curry leaves are contaminated with a typical bacteria called Salmonella.
  • So it is advised to cook the curry leaves deeply so that these type of bacteria are eradicated. At the same time make sure that you dont fry them as the nutrition value decreases drastically.
  • These leaves are also used in some hair oils to increase the hair growth as well as to prevent the premature greying. But the excess use of it may decrease the strength of the roots. Hence limited usage is advised in this regard.
Conclusion

Even though curry leaves have some drawbacks, these can be termed as the most beneficial and customary herbs used in every kitchen item. If we give an exception for excess consuming of these raw leaves, everything it gives is very hygienic. So without any worry you can use it regularly.


సహజసిద్ధమైన సువాసనతో పాటు రుచిని కూడా కలిగించే కర్వేపాకును భారతదేశ వంటకాలలో విరివిగా వాడుతుంటారు. వీటిని జతచేయకపోతే కూర రుచించదనే అభిప్రాయం చాలా మందిలో ఉందంటే వీటి విలువ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ప్రాచీన కాలం నుండి వినియోగించబడుతున్న వీటి ఆకులలో ఎన్నో రోగాల నిర్మూలనకు ఉపయోగకరంగా ఉండే అనామ్లజనకాలు, విటమిన్లు మరియు కాల్షియమ్ సమృద్ధిగా లభిస్తాయి. అయితే భారతదేశంలో వెలుగు చూసి ఆ తరువాత శ్రీలంకకు కూడా వ్యాపించిన ఈ ఆకులతో నష్టాలు కూడా ఉంటాయట. వినడానికి ఇది చిత్రంగా ఉన్నా నిజమే అంటున్నారు కొంతమంది ఆరోగ్య నిపుణులు. మరి ఎంతో ఉపయుక్తంగా ఉండే కరివేపాకుతో వచ్చే లాభాలు, మనకు తెలియని నష్టాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

కరివేపాకు చేసే మేలు
  • రక్తహీనతను తొలగిస్తుంది : కరివేపాకులో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్లు అధిక శాతంలో ఉంటాయి కనుక వీటి లోపం వలన ఏర్పడే రక్తహీనతను తగ్గించవచ్చు. చేయాల్సిందల్లా ఒకటే, కరివేపాకు ఆకులను ఒక నెల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడమే.
  • కాలేయ రక్షణ : కరివేపాకులో ఉండే అనామ్లజనకాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీటిలో విరేచనాల మందుకు ఉండే గుణం ఉంటుంది కనుక ఉదరాన్ని శుభ్రం చేసి అరుగుదలను మెరుగు పరచడంలో బాగా తోడ్పడుతుంది.
  • కొవ్వును తగ్గిస్తుంది : పైన చెప్పుకున్నట్లు వీటి ఆకులు ఉదరాన్ని శుభ్రం చేయడమే కాకుండా ఒంట్లో అధిక శాతం పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలోనూ సహాయకరంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా వీటిని నిత్యం వినియోగించవచ్చు.
  • హెపటైటిస్ నిర్మూలన : కాలేయ వాపు వలన కలిగే హెపటైటిస్ రోగాన్ని తగ్గించడంలో ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. హెపటైటిస్ నిర్మూలనకు వీటిలో ఉండే అనామ్లజనకాలు, విటమిన్ ఎ మరియు విటమిన్ సి గుణాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
  • కంటి రక్షణ : విటమిన్ ఎ లోపం కారణంగా కంటి చూపు కోల్పవడం లేక రేచీకటి రావడం జరుగుతుంది. కరివేపాకులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది కనుక ఈ రోగాలను దరిచేరనివ్వదని చెప్పొచ్చు.
  • మధుమేహ నిర్మూలనకారి : చాలా మంది వైద్య నిపుణులు కరివేపాకుకు మధుమేహ వ్యాధిని నయం చేసే గుణం ఉంటుందని చేనుతున్నారు. శాస్త్రీయంగా ఇంకా ఈ ఉదంతంపై పరిశోధనలు జరుగుతున్నా ప్రతిరోజూ వీటిని ఆహారంలో భాగం చేయడంతో మధుమేహ వ్యాధి తప్పకుండా అదుపులో ఉంటుందని వైద్యులు అంటున్నారు.
  • ఆయుర్వేదంలో : కరివేపాకు ప్రాచీన కాలానికి చెందినది కాబట్టి దీనిని ఆయుర్వేద ఔషధంగా వాడటంలో ఆశ్చర్యమేమీ లేదు. కరివేపాకు జిగురును చర్మ రోగాల నివారణకు, గాయాల మాన్పిడికి, కాలిన బొబ్బల నుండి ఉపశమనం పొందటానికి వాడటం జరుగుతుంది. అంతేకాకుండా జుట్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కూడా వీటిని వినియోగిస్తారు.
నష్టాలు
  • ఇతర మూలికా పదార్ధాలతో పోల్చితే కరివేపాకు వలన కలిగే నష్టాలు చాలా తక్కువనే చెప్పాలి. కొంతమంది పరిశోధకుల ప్రకారం అతిగా కరివేపాకును తీసుకుంటే అతిసారం మరియు వాంతులు అయ్యే అవకాశం ఉన్నట్లు తేలింది. దీనికి ప్రధాన కారణం, కరివేపాకును పచ్చిగా ఉడికించి తినడం వలన సాల్మొనెల్లా అనే బాక్టీరియా జత కలవడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  • అందుకే కూరలో కరివేపాకు ఉడికే వరకు ఉంచాలని, పచ్చిగా తినకపోవడమే మంచిదని వారంటున్నారు. అయితే ఉడికించడమంటే బాగా వేపడం కాదు, అలా చేస్తే కరివేపాకులో ఉండే పోషణలు తొలగిపోతాయి.
  • జుట్టు పెరిగేందుకు మరియు త్వరితగతిన తెల్లబడకుండా నిలువరించేందుకు కొన్ని నూనె ఉత్పత్తులలో కరివేపాకును జతచేస్తారు. అటువంటి నూనెను అధికంగా వినియోగిస్తే జుట్టు కుదుళ్ళు బలాన్ని కోల్పోయే అవకాశం ఉందట. కాబట్టి పరిమితులలో దీనిని వినియోగించడం మంచిది.
చివరిమాట

కరివేపాకు వలన కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ వీటిని అత్యంత ఉపయోగకర వంట పదార్ధంగా అభివర్ణిస్తుంటారు ఆహార ప్రియులు. ఒక్క అపరిమిత వినియోగాన్ని మినహాయిస్తే కరివేపాకు వలన కలిగే లాభాలు అనేకం. అందుకే వీటిని తరచూ వినియోగించడంలో ఎటువంటి నష్టం ఉండదని వైద్య నిపుణులు అంటున్నారు.

Read More

Commercial Crops

Sugarcane(చెరకు)

Sugarcane(చెరకు)

Sugarcane can be termed as the best beneficial health substance available at cheap price. It belongs to the grass family of Poaceae and originated from New Guinea. It can be eaten directly or consumed by making juice. As a rich nutrient substance the juice of sugarcane is very common on the streets of India, especially on hot summer days. The sugarcane juice with a touch of lemon, mint and ice gives enormous taste. At present, India holds the highest place in terms of sugarcane production and consumption. But as a matter of fact it also has some cons, so lets find out what are the cons and pros with it.

Benefits
  • The primary benefits of sugarcane comes up with its juice. It has high calories with no fat substances, a 100 gram sugarcane consists of approximately 250 calories of energy. The natural glucose contents present in it helps in maintaining muscle power.
  • It is used to make Jaggery which is a traditional sweet substance for preparing many household varieties. The sucrose present in it helps in healing wounds.
  • Sugarcane is also used in making alcoholic drinks like RUM, Cachaca, Basi etc.
  • Chewing of raw sugarcane strengthens the teeth and avoids any throat pain, cough and flu. It protects the teeth from decaying while increasing the shiny nature of teeth. Apart from that, sugarcane is also used as a substance in preparing biofuel.
  • It contains good amounts of glucose which gives instant energy when you feel tired. That is why every health specialist recommends this juice during hot summer days instead of any chemically made cool drinks.
  • The natural sugar contents in sugarcane has the potential to control the glucose levels in the blood. so this drink is also very much useful for diabetic patients also. But keep in mind that some type of diabetic patients are advised to consult the doctor before consuming it, especially type 2 diabetic patients.
  • Sugarcane contains high amounts of calcium, magnesium, manganese, iron and potassium. These nutrients are very much useful for fighting with cancer generating cells.
  • Moreover it is also very much handy in avoiding liver related issues like jaundice. It protects the liver from many infections by maintaining bilirubin levels.
  • Sugarcane acts as a good remedy for avoiding constipation. The typical qualities of it increases the immune system and protects the stomach.
Drawbacks
  • Most of the sugarcane juice is prepared at contaminated places that results in so many health problems. So choosing fresh and clean sugarcane juice is important. Usually health experts recommend to drink it immediately after crushing from the canes, if you preserve it for longer periods it becomes toxic.
  • The higher amounts of calories present in sugarcane may result in weight gain if consumed excessively. In contradiction to that, it may result in bad functioning of digestive system that further causes vomiting and weight loss.
  • According to experts the excess intake of sugarcane juice results in allergy and headache in some people. Also it may show affect in cholesterol levels in the body. So daily not too excess or not too low, but moderate drinking of this juice is advisable.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్ధాలలో చెరకును ఉత్తమమైనదిగా పేర్కొనవచ్చు. పొయేషియా అనే గడ్డి జాతికి చెందిన చెరకు న్యూ జెనీవాలో పుట్టి ఆ తరువాత తన తీయని రుచితో ప్రపంచమంతా విస్తరించింది. దీనిని నేరుగా తినవచ్చు లేక రసం తీసుకుని తాగవచ్చు. అయితే దీనిని నేరుగా తినడం కష్టం కనుక ఎక్కువగా రసంగా తీసుకుని సేవించడమే పరిపాటి. ఎన్నో పోషకాలకు నిలయమైన చెరకు వాడకం భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది, ముఖ్యంగా వేసవిలో దీని గిరాకీ అత్యంత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశం చెరకు వినియోగంలో గాని, దిగుబడి చేయడంలో గాని ప్రథమ స్థానంలో ఉంది. అయినా కూడా మనుషులకి దీనివలన కొన్ని నష్టాలు లేకపోలేదు. మరి దీనివలన కలిగే లాభనష్టాల గురించి ఒకసారి చూద్దాం.

ముందుగా లాభాలు
  • చెరకులో ముఖ్యంగా రసంతోనే ఎక్కువ లాభం చేకూరుతుంది. దీనిలో కొవ్వు మాత్రం అసలుండకపోగా ఎక్కువ మోతాదులో కేలరీలు లభిస్తాయి. వందగ్రాముల చెరకు రసంలో దాదాపు 250 కేలరీల శక్తి దాగి ఉంటుంది. ఇందులో సహజంగా లభించే గ్లూకోస్ శరీరదారుఢ్యానికి బాగా పనికొస్తుంది.
  • చెరకులో ఉండే సుక్రోస్ పదార్ధం శరీరంలోని గాయాలను మాన్పించడంలో తోడ్పడుతుంది.
  • మన ఇంట్లోని వివిధ రకాల పదార్ధాల తయారీకి వినియోగపడే బెల్లం కూడా చెరకు నుండి తయారు చేయబడుతుంది.
  • వివిధ రకాల మత్తుపానీయాలైన రమ్, కాచక, బాసి వంటి వాటిలో కూడా చెరకును ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది.
  • పచ్చిక చెరకును తినడం మూలంగా పళ్ళు గట్టిపడటమే కాక పంటిపై గార తొలగిపోయి తెల్లగా కూడా అవుతాయి. అంతేకాకుండా గొంతు వ్యాధులు, దగ్గు మరియు ఫ్లూ వంటి రోగాలు కూడా రాకుండా చేయగలదు.
  • దీనిని ఇథనాల్ తోపాటు చేయబడే జీవ ఇంధనంలో కూడా వాడటం చాలా సహజం.
  • దీనిలో అధికంగా ఉండే గ్లూకోస్ త్వరితగతిన శక్తిని ఇస్తుంది. అందుకే చాలా మంది వైద్య నిపుణులు ఇతర అసహజ పానీయాలకంటే చెరకు రసాన్ని ఎక్కువగా సిఫారసు చేస్తుంటారు.
  • చెరకులో ఉండే సహజసిద్ధమైన చక్కర మోతాదు రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రిస్తుంది కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని సేవించడం మంచిది, అయితే ఇది కొంతమందికే వర్తిస్తుందని చెప్పాలి. మధుమేహ వ్యాధిలో రెండవ రకం వారు వైద్యులను సంప్రదించిన తరువాతే దీనిని సేవించడం చేయాలి.
  • ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం మరియు మాంగనీస్ వంటి పోషణలు కాన్సర్ వంటి ప్రమాదకర రోగాలతో పోరాడగల సామర్ధ్యాన్ని కలిగిస్తాయి.
  • అంతేకాకుండా కాలేయ వ్యాధులకు సంబంధించి చెరకు రసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో దీని ఉపయోగాలు చాలా అధికం.
  • ఇక మలబద్దకాన్ని వీడడంలోనూ చెరకు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇందులో ఉండే ప్రత్యేక గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి ఉదరాన్ని పరిరక్షిస్తాయి.
నష్టాలు
  • ఎక్కువ శాతం చెరకు రసం అపరిశుభ్రమైన ప్రాంతాలలో లభించడం మూలంగా ఆరోగ్యపరమైన నష్టాలను చూడవలసి వస్తుంది. కాబట్టి తాజా చెరకు రసాన్ని ఎన్నుకోవడమనేది చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. సాధారణంగా చెరకుగడ నుండి పిండిన మరుక్షణమే రసాన్ని సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు, మరీ ఎక్కువసేపు ఉంటే చెరకు రసం తన సారాన్ని కోల్పోయి విషంగా మారిపోయే ప్రమాదం కూడా ఉందట.
  • ఇందులో ఉండే అత్యధిక కాలరీల వలన శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి విరుద్ధంగా అప్పుడప్పుడు అరుగుదల లోపించి శరీర బరువు తగ్గటమే కాకుండా వాంతులు కూడా అయ్యే అవకాశం ఉన్నట్లు కొంతమంది ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
  • అంతేకాకుండా అధిక మోతాదులో చెరకు రసం తీసుకోవడం మూలంగా తలనొప్పి, అలర్జీ సమస్యలతో పాటు శరీరంలోని కొవ్వు స్థాయిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే అటు మరీ ఎక్కువగా కాకుండా ఇటు మరీ తక్కువగా కాకుండా మధ్యస్తంగా చెరకు రసం తీసుకుంటే ఆరోగ్యానికి మంచి లాభదాయకంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య పండితులు.
Read More